నిన్నే బురిడీ కొట్టించారా : రూ.150 కోట్లకు మోసపోయిన ధోనీ

DHONIభారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అమ్రపాలి గ్రూప్‌ పై న్యాయపోరాటానికి దిగారు. అమ్రపాలి గ్రూప్‌, తనకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆరోపిస్తూ ధోని దావా దాఖలు చేశారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నాను అని.. ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదని తన కంప్లయింట్ లో తెలిపారు.

ప్రస్తుతం అమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ.. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రారంభించిన హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ లు పూర్తి చేయలేకపోతోంది. ధోని మాత్రమే కాక, KL రాహుల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సౌతాఫ్రికాకు చెందిన క్రికెటర్‌ ఫ్రాంకోయిస్ డుప్లెసిస్ కూడా అమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థపై ఢిల్లీ హైకోర్టులో రికవరీ దావా వేశారు. బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ కార్యకాలపాల్లో అమ్రపాలి గ్రూప్‌ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని.. రితి స్పోర్ట్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ పాండే కూడా తెలిపారు. ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు.

ఈ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్‌ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో.. 2016 ఏప్రిల్‌ లో ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు ధోని. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు.

Posted in Uncategorized

Latest Updates