నిఫా వైరస్ అనుమానం : కోల్ కతాలో 27 ఏళ్ల సైనికుడు మృతి

ipha-jepgపశ్చిమ బెంగాల్ కోల్ కతాలో నిఫా వైరస్ కలకలం. ఓ సైనికుడి శరీరంలో నిఫా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే అతను చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందినా.. గుర్తించలేకపోయారు వైద్యులు. చనిపోయిన తర్వాత అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తే.. నిఫా వైరస్ ఉన్నట్లు తేలిసింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళకు చెందిన శీనుప్రసాద్ సైన్యంలో పని చేస్తున్నారు. 27 సంవత్సరాల వయస్సు. కోల్ కతాలోని పోర్ట్ విలియమ్ లో తన విధులు నిర్వహిస్తున్నాడు. గత నెలలో సొంత రాష్ట్రం కేరళకి వెళ్లి వచ్చాడు. అక్కడ నెల రోజులు ఉన్నాడు. తిరిగి కోల్ కతాకి మే 14వ తేదీన వచ్చాడు. వారం రోజుల తర్వాత మే 20న ఆరోగ్యం బాగోలేదంటూ కమాండ్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. చికిత్స పొందుతూ.. 27వ తేదీ ఆదివారం చనిపోయాడు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న సైనికుడు.. ఒక్కసారిగా చనిపోవటం అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత రోజు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. శీనుప్రసాద్ మరణంపై డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఫా వైరస్ లక్షణాలు ఉండొచ్చన్న ఆలోచనతో.. అతని శాంపిల్స్ ను పూణెలోని ల్యాబ్ కు పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. అతనికి చికిత్స చేసిన డాక్టర్లు మాత్రం నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు చెబుతుండటంతో.. ఇప్పుడు ఆస్పత్రిలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates