నిఫా వైరస్ షాకింగ్ న్యూస్ : పిల్లులు, కోతులు, పందుల నుంచి కూడా రావొచ్చు

nipah-virusనిఫా వైరస్ పై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేరళోని కోజికోడ్ లో ఈ వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే 12 మంది చినిపోయారు. ఈ వైరస్ కు చికిత్స చేస్తున్న ఓ నర్సు కూడా చనిపోవటం సంచలనం అయ్యింది. మందులు లేని ఈ వైరస్ కు.. ముందు జాగ్రత్తలు తీసుకోవటమే ఉత్తమం అంటున్నారు వైద్యులు. నిఫా వైరస్ కేవలం గబ్బిలాల వల్ల మాత్రమే రాలేదని తేల్చారు శాస్త్రవేత్తలు. కోజికోడ్ లో ఓ బావిలో చనిపోయి ఉన్న, బతికి ఉన్న గబ్బిలాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్ పరిశోధన కేంద్రాలకు పంపించారు కేరళ అధికారులు.

ఆ గబ్బిలాల్లో నిఫా వైరస్ లేదని తేల్చారు. కేరళ నుంచి సేకరించిన గబ్బిలాల్లో ఈ వైరస్ లక్షణాలు లేవని తేలటంతో అధికారులు, వైద్యులు ఇప్పుడు షాక్ అయ్యారు. మొత్తం 21 శాంపిల్స్ ను పరీక్షించిన తర్వాత ఈ నిర్థారణకు వచ్చారు పశువైద్య శాఖ అధికారులు. ఒక్క గబ్బిలాల నుంచే కాకుండా పందులు, పిల్లులు, కోతుల నుంచి కూడా నిఫా వైరస్ వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. దీంతో ఇప్పుడు కేరళలో కోతులు, పిల్లులు, పందులు తిరిగే ప్రాంతాల్లో ఫాగింగ్ మొదలుపెట్టారు. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈ మూడు జంతువుల నుంచి వచ్చే అవకాశం ఉందని.. అయితే వాటిలో ఈ వైరస్ ఇంకా గుర్తించలేదని చెబుతున్నారు కేరళ పశువైద్య శాఖ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates