నిబంధనలు సడలింపు: గిరిజనులకు కేసీఆర్ కిట్లు

kcr-kitsప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు….ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను సంఖ్యను పెంచేందుకు.. కేసీఆర్ కిట్ల పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేసీఆర్ కిట్ల విషయంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఇద్దరు సంతానానికి మాత్రమే కేసీఆర్ కిట్లు ఇవ్వాలన్న నిబంధనలు సడలింపు చేసింది. కోలం(మన్నేవార్లు), చెంచులు, కొండరెడ్లతో పాటు తోటి తెగలకు ఈ మినహాయింపు ఉంటుంది. ఇద్దరు పిల్లలు నిబంధనతో సంబంధం లేకుండా కేసీఆర్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో గ‌ర్భిణిగా ముందుగా పేరు న‌మోదు చేసుకుని, వైద్య ప‌రీక్ష‌లను చేయించుకుని ప్ర‌స‌వించిన త‌ల్లికి కేసీఆర్ కిట్ పథకం వర్తిస్తుంది. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మహిళలకు ఈ పథకం కింద రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిచ్చిన వారికి రూ.12 వేల‌ను అందిస్తారు. ఈ నగదును వాయిదాల పద్దతిలో అందజేస్తారు.

నగదుతో పాటు రెండువేల విలువ చేసే 15రకాల వస్తువులతో కూడిన కిట్స్‌ను అందచేస్తారు. దీంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే మాతా, శిశువులను అమ్మ ఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్తారు. శిశువు కోసం ఇచ్చే కిట్ తో పాటు ..తల్లి కోసం రూ.350 విలువ చేసే రెండు చీరలు, రూ.40 విలువైన రెండు సబ్బులు, రూ.150 విలువైన కిట్‌బ్యాగ్, రూ.50 విలువ చేసే ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates