నిబంధనల ప్రకారమే TTL లీగ్ నిర్వహించాం: వివేక్ వెంకటస్వామి

vivలోథా కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్న ఏకైక అసోసియేషన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పారు.. HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. శేష్ నారాయణ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన HCA పరువు తీస్తున్నారని మండిపడ్డారు. శేష్ నారాయణపై పరువునష్టం దావా వేస్తామన్నారు వివేక్. టీటీఎల్ లీగ్ నిబంధనల ప్రకారమే నిర్వహించామన్నారు. బీసీసీఐ నుంచి HCAకు ఎలాంటి నిధులు, సబ్సిడీలు రావడం లేదన్నారు. నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు వివేక్. ఎలాంటి ఆడిటింగ్ కు అయినా రెడీగా ఉన్నామని చెప్పారు. HCA సీఈవోని నిబంధనల ప్రకారమే నియమించామని క్లారిటీ ఇచ్చారు.

Posted in Uncategorized

Latest Updates