నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, భోజన వసతి : న్యాక్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులకు పలు కోర్సుల్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపింది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్). EGMM, DDUGKY సంస్థల సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 ఏండ్ల నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్ తో పాటు .. భోజన వసతి కల్పించనున్నట్టు తెలిపింది. పదోతరగతి పాస్ , ఫెయిల్ అయిన అభ్యర్థులకు ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్, డ్రైవాల్ అండ్ సీలింగ్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు సంస్థ అధికారులు.

స్టోర్‌ కీపర్ ట్రైనింగ్ కు డిగ్రీ, ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్, సూపర్‌ వైజర్ పోస్టులకు ఇంటర్, ITI విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌ లు, 6 పాస్‌ పోర్టు ఫొటోలతో న్యాక్ ఆఫీసులో సంప్రదించాలని కోరారు.  వివరాలకు 7989050888, 8328622455 నంబర్లలో సంప్రదించాలని సూచించారు న్యాక్ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates