నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : జూన్ 2న గ్రూప్-1 నోటిఫికేషన్

TSPSCనిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గ్రైప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జూన్‌ 2న నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌ లు ఉన్న 76 గ్రూప్‌–1 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు TSPSC వద్ద ఉన్నాయి. లేటెస్ట్ గా 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వాటితో పాటు 2011 గ్రూప్‌–1లో జాయిన్‌ కాని పోస్టులు మరో 7 వరకు ఉన్నాయి. అవి కాకుండా ఇతర శాఖల్లోనూ పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా వాటి అనుమతులు, ఇండెంట్లతో పాటు డీఎస్పీ పోస్టులకు ఇండెంట్లు ఇస్తే జూన్‌ 2న TSPSC ద్వారా 150కి పైగా పోస్టులతో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ను జారీ చేసే అవకాశం ఉంది.  పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకావం ఉంది.

 

 

Posted in Uncategorized

Latest Updates