నిరుద్యోగులకు శుభవార్త : 60 వేలకి పెరిగిన రైల్వే ఉద్యోగాలు

రైల్వేలోని అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. 26,502 ఖాళీల భర్తీకి మొదట ప్రకటన విడుదల చేసిన రైల్వేశాఖ ఆ ఖాళీలను రెట్టింపు చేసింది. మొత్తం 60వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది రైల్వేశాఖ. ఈ నెల 9న మొదటిసారిగా కంప్యూటర్ ద్వారా నిర్వహించనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 47.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేస్తూ 26,502 అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టులను రెట్టింపు చేశాం. 60వేల పోస్టుల భర్తీకిగాను పరీక్షలు నిర్వహించనున్నామని  పేర్కొన్నారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది రైల్వే శాఖ.

Posted in Uncategorized

Latest Updates