నిరుద్యోగులకు శుభవార్త : 9వేల 739 పోస్టులకు రైల్వేశాఖ నోటిఫికేషన్

ralనిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9వేల 739 పోస్టులకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 8 వేల 619 పోస్టులు కానిస్టేబుల్ భర్తీకి, 1120 పోస్టులు ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్-1, 2018 నుంచి అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే శాఖ అధికారక పోర్టల్ WWW.indianrailways.gov.in ద్వారా అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లయి చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయి చేసుకోవడానికి చివరి తేదీ జూన్-30, 2018. పూర్తి వివరాల కోసం railwayrecruitmentgov.in లేదా indianrailways.gov.in వైబ్ సైట్లను సందర్శించవచ్చని రైల్వే శాఖ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates