నిరుద్యోగులకు శుభవార్త: ఉగాది నుంచే నిరుద్యోగ భృతి!


ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఒక్కో హామీని నెరవేర్చేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఎలా అమలు చేయాలి..దీనికి మార్గదర్శకాలు ఏమిటి.. లబ్ధిదారులను ఎలా గుర్తించాలనే అంశాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ ప్రక్రియ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఉగాది నుంచే నిరుద్యోగ భృతి అమలు కానుంది. లేదంటే తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2 నుంచి నిరుద్యోగ భృతి చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

నిరుద్యోగ భృతికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు నమోదైనట్లు అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో దీనికి సంబంధించి నిధులు కేటాయించాల్సిరావడంతో ఆర్థికశాఖ అధికారులు దానికనుగుణంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిరుద్యోగ భృతి అమలు కావాలంటే కనీసం 500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates