నిరుద్యోగ భారతం : 90వేల ఉద్యోగాలకు 2 కోట్ల దరఖాస్తులు

unemploymentదేశంలో నిరుద్యోగం ఎలా ఉందో చెప్పటానికి ఈ వార్త ఒక్కటి చాలు. ఉపాధి, ఉద్యోగాల కోసం యువత ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పటానికి ఈ లెక్కలు చాలు. ఇండియన్ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల కింద 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 31 చివరి తేదీ. ఈ 90వేల ఉద్యోగాల కోసం అక్షరాల 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అది కూడా 27వ తేదీ వరకు మాత్రమే. మరో మూడు రోజులు గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రైల్వే అధికారులు.

2 కోట్ల అప్లికేషన్స్ లో 50లక్షల ఆన్ లైన్ ద్వారా వచ్చాయి. 90వేలలో.. 26వేల 502 ఉద్యోగాలు లోకో పైలట్, టెక్నీషియన్స్ కు సంబంధించినవి. ఈ సంఖ్యను చూసి కేంద్ర ప్రభుత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో 3 కోట్ల 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా ఉపాధి, ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. 2018 జనవరిలో 5శాతంగా ఉన్న నిరుద్యోగుల శాతం.. మార్చి నెలకి 6.1శాతానికి పెరిగింది. మే నెలలో లక్షల మంది డిగ్రీ పట్టాలతో రోడ్డెక్కబోతున్నారు. మొత్తంగా 3.5 కోట్ల మంది యువత ఉపాధి, ఉద్యోగం కోసం దేశంలో ఎదురుచూడటం.. ప్రభుత్వాలకి పెద్ద సవాల్ గా మారబోతున్నది..

Posted in Uncategorized

Latest Updates