నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్న కలెక్టర్

జిల్లా పాలనలో నారాయణపేట కలెక్టర్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కరోనా టైంలో నిరుపేదలకి ఉపాధి కల్పిస్తు న్నారు. జిల్లాలో ని ఆడవాళ్లతో ఆయుర్వేద మాస్క్ లు తయారు చేయించి దేశవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. మాస్క్​ తయారీకి కావాల్సిన ముడిసరుకుని చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసి వాళ్లకీ చేయూతనిస్తున్నారు. జిల్లా అభివృద్ధికోసం కొత్తకొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్న ఈ నారాయణపేట కలెక్టర్ హరిచందనపై స్పెషల్ స్టోరీ.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎం.ఏ పూర్తి చేసిన హరిచందన… పేద ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్ సర్వీస్ లోకి వచ్చారు. జీహెచ్ఎంసీలో వెస్ట్ జోన్ కమిషనర్ గా గ్రీన్ గవర్నె న్స్, క్లైమేట్ ఛేంజ్,రీ సైక్లింగ్, షీ టాయిలెట్స్, పింక్ టాయిలెట్స్, జీ వేస్ట్ ఆఫీస్ , బ్యాంబు మీటింగ్ హాల్, ఫీడ్ ది నీడ్, కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నా రు. 2020 ఫిబ్రవరి 3 న నారాయణపేట కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన మార్క్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కరోనా కంట్రోల్ చర్యలు తీసుకుంటూనే… ఉపాధికి ఊతమిచ్చే స్కీమ్ లు తీసుకుంటున్రు.

బస్సులే టాయిలెట్స్…

జిల్లాలోని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్స్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దా రు ఈమె. వెయ్యి జనాభాకు ఒక టాయిలెట్ చొప్పున ఏర్పాటుచేశారు. కాలం చెల్లిన బస్సులను టాయిలెట్స్ గా మార్చారు ఈ కలెక్టర్. టాయిలెట్ ఆన్ వెహికల్ లో బయో టాయిలెట్స్ తో పాటు బస్సులోనే చంటి బిడ్డలకు పాలిచ్చే విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు స్వచ్చ భారత్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, స్వచ్చ గ్రామాల పేరుతో జిల్లాని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.

మహిళలకు చేయూత…

ఇక కరోనా సీజన్ లో మాస్క్ ల కొరత ఏర్పడటంతో జిల్లాలోని మహిళలతో మాస్క్ లు తయారీ చేయిస్తున్నారు హరిచందన. సింగిల్ లేయర్, డబుల్ లేయర్, త్రిపుల్ లేయర్ తో మాస్క్ లు చేయించి ఆడవాళ్లకి ఉపాధి కల్పిస్తున్నారు. వీటితో పాటు ప్రత్యేకించి ఆయుష్ శాఖ సర్టిఫైడ్ చేసిన ఆయుర్వేదిక్ మాస్క్ లను లక్షల్లో తయారు చేయించి హైదరాబాద్ తో పాటు ఇరుగు పొరుగు జిల్లాల్లోని పలు సంస్థలకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ప్రముఖ సంస్థలు రాంకీ, లింక్ వెల్ , మెట్రో రైల్ తోపాటు హీరో విజయ్ దేవరకొండ కు చెందినా రౌడీ గార్మెంట్స్, FICCI, TSIIC సంస్థలు కూడా మాస్క్ ల కోసం ఆర్డర్లు ఇస్తున్నాయి వీళ్లకి.

అభివృద్ధే లక్ష్యం…

జిల్లాలో మూడు చోట్ల మియవాకి పద్దతిలో అడవులను పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించింది. వర్షాలు బాగా పడటంతో ఇప్పుడు ఆ మొక్కలు బాగా పెరిగి జిల్లాకి కొత్త కళ తీసుకొ స్తున్నా యి. మార్క్ పాలనకు గుర్తుగా పీఎం ఇన్నోవేషన్ అవార్డు జాబితాలో రాష్ట్రం నుంచి బరిలో ఉన్న ఏకైక ఐఏఎస్ గా నిలిచింది.

Latest Updates