నిర్మల్ జిల్లాలో టైగర్ కలకలం

నిర్మల్ : కవ్వాల్ అభయారణ్యంలో చాలాకాలం తర్వాత పెద్దపులి కన్పించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ కడెం రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు పెద్దపులి తిరుగుతున్న దృశ్యాలు చిక్కాయి. గత కొంత కాలంగా అభయారణ్యంగా పరిధిలో మానవ సంచారం, చెట్లు కొట్టడాన్ని నిషేధించింది అటవీ శాఖ. అటవీ శాఖ చర్యలతో దాదాపు ఏడాది తర్వాత కవ్వాల్ అభయారణ్యంలో పులి సంచారం కన్పించింది. దీంతో  తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు.

Posted in Uncategorized

Latest Updates