నిర్మల్ ESI ఏర్పాటుకు కేంద్రం సానుకూలం : ఇంద్రకరణ్ రెడ్డి

indrakaran2102ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తున్నారు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. బుధవారం (ఫిబ్రవరి-21) ఉదయం వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్, మధ్యాహ్నం కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లను కలిశారు. కందులు కొనుగోలు చేయాలని, నిర్మల్ లో ESI హస్పిటల్  ఏర్పాటుపై విజ్ఞప్తిచేశారు మంత్రి.

త్వ‌రగా ESI ఆసుప‌త్రి ఏర్పాటు చేసి, వైద్య సేవ‌లు ప్రారంభ‌మ‌య్యేలా చొర‌వ చూపాల‌ని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ ని కోరిన‌ట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ESI హ‌స్పిట‌ల్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించార‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు కేంద్ర కార్మిక శాఖ అధికారుల‌కు త‌గిన ఆదేశాలు జారీ చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరామ‌న్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలో ESI ఆసుపత్రిని ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల.. నిర్మ‌ల్ జిల్లాతో పాటు ఇత‌ర స‌రిహ‌ద్దు జిల్లాల‌ బీడీ కార్మికుల‌కు వైద్య సేవ‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates