నిర్మాణంలోని వంతెనలను త్వరగా పూర్తి చేయండి: కేటీఆర్

KTR11హైదరాబాద్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వంతెనలు త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి కేటీఆర్.GHMC పరిధిలో రైల్వేశాఖతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు నగర మేయర్, GHMC, రైల్వే అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం(ఏప్రిల్-10) భేటీ అయ్యారు. చర్లపల్లి రైల్వే టర్నినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ నిర్మాణం, మెట్రో రైలు, MMTS రెండోదశ పనులు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ వేగం పెంపు విషయాలపై అధికారులతో చర్చించారు. భూముల విషయంలో రైల్వేశాఖ మంత్రిని కోరితే సానుకూలంగా స్పందించారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, రోడ్ల విస్తరణకు అవసరమైన భూములను రైల్వే ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్బీనగర్, మియాపూర్, హైటెక్ సిటీ, జేబీఎస్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates