నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై చర్యలు : సీపీ

CPమీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. సోషల్ మీడియా పుకార్లతో దాడికి గురైన ఓ వ్యక్తి పట్ల … అమానుషంగా ప్రవర్తించినందుకు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు.

మరో ఇద్దరు ఎస్సైలకు చార్జ్ మెమోలు ఇచ్చారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో… విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలకు సిద్ధమయ్యారు సీపీ మహేష్ భగవత్. మే 21న దొంగ అనే అనుమానంతో … రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లో స్థానికులు గుర్తు తెలియని ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ కేసులో స్థానికుల దాడికి గురైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న మీర్ పేట్ పోలీసులు… అతన్ని ఆస్పత్రికి కాకుండా సిటీ శివారులోని సంఘీ టెంపుల్ రూట్లోని బ్రహ్మణపల్లి దగ్గర వదిలివెళ్ళారు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఫిట్స్ రావడంతో ఆ వ్యక్తి చనిపోయాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు విచారణ ప్రారంభించారు. అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళింది మీర్ పేట్ పోలీసులని గుర్తించారు. ఈ కేసుపై విచారణ జరిపిన స్పెషల్ టీం…  సీపీ మహేష్ భగవత్ కు రిపోర్టు అందజేసింది. రిపోర్టే ఆధారంగా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.  అయితే ఈ ఘటనను సూమోటోగా తీసుకున్న HRC ఈ నెల 18లోగా నివేదిక ఇవ్వాలని సీపీని ఆదేశించింది. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటికే నలుగురు మల్కాజిగిరి SOT పోలీసులను సస్పెండ్ చేశారు సీపీ మహేష్ భగవత్. లేటెస్ట్ ఇష్యూలో మీర్ పేట్ పోలీసులపై చర్యలు తీసుకునే చాన్స్ ఉండటంతో…. విషయం బయటికి రాకుండా సీక్రెసీ మెయింటెన్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates