నిలువెల్లా మంటలు : రైల్ షాక్ కొట్టి కళ్ల ముందు బూడిద

tamil
ఇంట్లో బల్బ్ షాక్ కొడితేనే ఎగిరి పడతాం.. కొన్ని సార్లు ప్రాణాలు పోతాయి. ఎర్తింగ్ వల్లే మనుషుల మధ్య కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తోంది. అలాంటిది రైలు నడవటానికి వేసే హైటెన్షన్ వైర్లు ఎలా ఉంటాయి. ముట్టుకుంటే కాదు.. దాని దగ్గర ఉన్నా ఎగిరిపడతాం. అలాంటిది రైల్ హైటెన్షన్ కరెంట్ వైరుకి తగిలిన ఓ వ్యక్తి నిలువెల్లా కాలిపోయాడు. కళ్ల ముందే క్షణాల్లో బూడిద అయ్యాడు. వందల మంది చూస్తుండగా జరిగిన ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

కావేరీ బోర్డ్ ఏర్పాటు కోరుతూ తమిళనాడులో అన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగా పీఎంకే పార్టీ కూడా రైల్ రోకోకి పిలుపు ఇచ్చింది. కొందరు పీఎంకే కార్యకర్తలు తిందివనం రైల్వేస్టేషన్ లో రైల్ రోకో చేపట్టారు. గురువాయూర్ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్నారు. రైలు కదలకుండా పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు రైలుపైకి ఎక్కారు. నినాదాలు చేస్తూ నడుస్తున్నారు. రంజిత్ కుమా అనే వ్యక్తికి రైలు పైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలాయి. అంతే శరీరం మొత్తం మంటలు వచ్చేశాయి. నిలువెల్లా మంటలతో క్షణాల్లో కాలి బూడిద అయ్యాడు. ఎలక్ట్రికల్ మిషన్ లో పెడితే ఎలా మాడి.. బూడిద అవుతారో అలా అయిపోయాడు. వందల మంది కార్యకర్తలు షాక్ అయ్యారు.

 

Posted in Uncategorized

Latest Updates