నివర్ తుఫాన్ ఎఫెక్ట్ ..తెలంగాణలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలపైనా నివర్ తుఫాన్ ప్రభావం చూపుతోంది. దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ అధికారులు. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందన్నారు. నల్గొండ ఖమ్మం, సూర్యాపేటలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయన్నారు. వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో  ఏపీలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడ్తున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్  తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 65 నుంచి 85  కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Latest Updates