నివాళులు అర్పించిన నెటిజన్లు : గుడ్ బై యాహూ మెసెంజర్

యాహూ చాటింగ్ మెసెంజర్ క్లోజ్ అయ్యింది. 20 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఐదేళ్లుగా చేర్పులు – మార్పులతో నడుస్తున్న యాహూ మెసెంజర్ 2018, జూలై 17వ తేదీ శాశ్వతంగా మూతబడింది. మారుతున్న కాలంతోపాటు అప్ డేట్ కాకపోవటం, ప్రజల అభిరుచులకు అనుగుణంగా మార్పు కాకపోవటంతో కంపెనీ మూతబడింది. ఇంటర్నెట్ సామాజ్రాన్ని శాసించిన స్థాయి నుంచి లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి.. చివరికి మూతబడింది. 1998లో ఇంటర్నెట్ ప్రారంభం అయిన  రోజుల్లో యాహూ ఓ విప్లవం.. ఇంటర్నెట్ అంటే యాహూగా వెలుగొందింది. రియల్ టైం కమ్యూనికేషన్ కు పునాది వేసింది యాహూనే కావటం విశేషం. ఇప్పటి లైవ్ చాటింగ్ ప్రారంభించింది కూడా యాహూనే. రియల్ టైం చాటింగ్ ద్వారా ఇంటర్నెట్ సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. పదేళ్లపాటు తన వైభవాన్ని కొనసాగించింది. ఆ తర్వాత గూగుల్, ఫేస్ బుక్ ఎంట్రీలతో తన ఉనికి కోల్పోతూ వచ్చింది.

2015 డిసెంబర్ లో యాహూ మెసెంజర్ కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. అయినా ఆశించిన స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లను పెంచుకోలేకపోయింది. కోట్ల సంఖ్యలో యాప్స్ వచ్చేయటం, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి కొత్త ఫ్లాట్ ఫాంలకు ధీటుగా యాహూ మెసెంజర్ ఆకట్టుకోలేకపోవటంతో.. కంపెనీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. యూజర్ల సంఖ్య దారుణంగా పడిపోవటంతో.. 2018 జూలై 17వ తేదీ మంగళవారం యాహూ తన మెసెంజర్ యాప్ ను క్లోజ్ చేసింది. చాటింగ్ హిస్టరీని డౌన్ లోడ్ చేసుకోవటానికి ఆరు నెలల సమయం ఇచ్చింది.

యాహూ మెసెంజర్ యాప్ కు నెటిజన్లు గుడ్ బై చెబుతున్నారు. కన్నీళ్లతో నివాళులు అర్పిస్తున్నారు. రిప్ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా యాహూ మెసెంబర్ ద్వారా అందరికీ లాస్ట్ వార్డ్ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. గుడ్ బై టూ యాహూ..

Posted in Uncategorized

Latest Updates