నిహారిక హ్యాపీ వెడ్డింగ్ ఫిక్స్

లక్ష్మన్ డైరెక్షన్ లో సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. సుమంత్ సరసన నిహారిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది యూనిట్. ఈ మూవీని జూలై 28న రిలీజ్ చేయనున్నట్లు బుధవారం (జూలై-11)న ట్విట్టర్ ద్వారా తెలిపింది. హ్య‌పి వెడ్డింగ్ ట్రైల‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల కాగా, ఇందులో పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి అనే డైలాగ్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.లేటెస్ట్ గా విడుద‌లైన ప్రోమో సాంగ్ కూడా అల‌రించింది. ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకి శ‌క్తికాంత్ కార్తీక్ మ్యూజిక్. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్, పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. నిహారిక న‌టించిన ఫస్ట్ మూవీ ఒక మ‌న‌సు డివైడ్ టాక్ రావ‌డంతో.. ఇప్పుడు ఆమె రెండ‌వ సినిమా హ్యాపీ వెడ్డింగ్ పై అభిమానుల్లో చాలా అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీ నిహారిక‌కి మంచి విజ‌యం అందించాల‌ని కోరుతున్నారు ఫ్యాన్స్.

Posted in Uncategorized

Latest Updates