నీకోసం మళ్లీ పుడతా : పార్టనర్ కోసం సైంటిస్ట్ ఆత్మహత్య

kali

దేవత కలలో కనిపిస్తుందా.. భవిష్యత్ చెబుతుందా.. జీవిత భాగస్వామి చెబుతుందా.. అవుననే అంటున్నాడు ఈ గే. ఇది చెబుతుందో ఎవరో చదువురాని వ్యక్తి కాదు.. బాగా చదువుకుని టెక్నాలజీపై రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి కావటం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ భోపాల్ లో నానో టెక్నాలజీ రీసెర్చర్ గా పని చేస్తున్నాడు నీలోట్ పోల్ సర్కార్(27). ఓ పెద్ద లేక్ లో దూకి చనిపోయాడు. పునర్జన్మ, కలలను పిచ్చిగా నమ్మే సర్కార్.. తన గే పార్టనర్ ను చావు నుంచి తప్పించడం కోసం ఈ పని చేశాడు. ఆదివారం (ఫిబ్రవరి 11) ఉదయం చెరువులో ఇతడి మృతదేహం కనిపించింది. అతడి గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. లెటర్ ఈ విధంగా ఉంది.

కాళీమాత నా కలలోకి వచ్చింది. అది 2016, అక్టోబర్ 30. దేశమంతా దీపావళి జరుపుకుంటున్నది. ఆ రోజే నా కలలోకి వచ్చిన దేవత.. శాశ్వతమైన ఆనందం గురించి చెప్పింది. సంవత్సరంలోపు నాకు సోల్ మేట్ దొరుకుతాడని చెప్పింది. అతడిని నేను వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంటే ఈ జన్మలో నేను అతడిని కలిస్తే.. వచ్చే జన్మలో అతడిని పెండ్లి చేసుకుంటాను. దీంతో నన్ను నేను అర్పించుకోవడానికి సిద్ధమయ్యాను. అనుకున్నట్లుగానే సంవత్సరంలోపు నాకు నా సోల్‌మేట్ కలిశాడు. అతడితోనే నా జీవితం అనుకున్నాను. కాని అది వచ్చే జన్మలో. అందుకే ఈ జన్మలో అతడికి ప్రపోజ్ చేశాను. నా జీవితాన్ని అర్పించుకున్నాను. వచ్చే జన్మలో ఖచ్చితంగా ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. అని ఆత్మహత్య చేసుకునే ముందు చివరగా సెల్ఫీ వీడియో తీసి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

నానో టెక్నాలజీపై రీసెర్చ్ చేస్తున్న ఓ యంగ్ సైంటిస్ట్.. ఇలాంటి ఆలోచనలతో ఆత్మహత్య చేసుకోవటం చర్చ అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates