నీటి సమస్య తీరేలా మిషన్ భగీరథ: మంత్రి హరీష్

harishraoఅభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు మంత్రి హరీష్ రావు. రాబోయే 50ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్ లైన్లు, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, అమీన్ పూర్ మండలాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.

బొల్లారంలో మిషన్ భగీరథ రిజర్వాయర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. 60ఏళ్లుగా మనం నీటి కోసం ఇబ్బందులు పడ్డామన్నారు. నీటి సమస్య తీరేలా మిషన్ భగీరథ పనులు చేపట్టామన్నారు. పనులు పూర్తి చేసి.. దసరా నాటికి నీరందిస్తామన్నారు. దసరా నాటికి బొల్లారంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంజీరా నీరందిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలకు 3 రోజుల పవర్ హాలీడే ఇచ్చారన్న మంత్రి హరీష్…అదే ప్రత్యేక రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు.

Posted in Uncategorized

Latest Updates