నీట మునిగిన ఢిల్లీ సెక్రటేరియట్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షంతో నగరమంతా అతలాకుతలమైంది.  సెక్రటేరియట్ లోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. సచివాలయం పైకప్పు నుంచి వాటర్ లీకవుతోంది.  గదుల్లోకి నీరు ధారగా కారుతుండటంతో పాటు ఏసీలు, ఫర్నీచర్ తడిచిపోయాయి. బిల్డింగ్ బయట కూడా భారీగా నీరు నిలిచిపోవడంతో…అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates