నీరవ్,మాల్యా అప్పగింతకు బ్రిటన్ షరతు

nerav -malyaభారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్ అడ్డుకట్టవేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో 75 వేల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు సహకరిస్తేనే వారిని అప్పగిస్తామని షరతు పెట్టింది. తమ దేశంలోని అక్రమ వలసదారులను బహిష్కరించే విషయంలో తమ వాదనను గౌరవించకపోతే బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో మరోసారి ఆలోచించుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.

దేశంలోని బ్యాంకుల కు 9వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు ఎగ్గొట్టి లండన్ పారిపోయాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ఇదే బాటలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(PNB) కుంభకోణంలో రూ. 13వేలకోట్లకుపైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్నాడు.

Posted in Uncategorized

Latest Updates