నీరవ్ కు వ్యతిరేకంగా CBI రెడ్ కార్నర్ నోటీసు

Nirav-Modiపంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(PNB)లో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్‌ మోడీకి వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఇందుకోసం ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది. నీరవ్‌ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశముంటుంది. పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసింది.

ఈ ఇద్దరు నిందితులను విచారణ కోసం తిరిగి భారత్‌కు రప్పించాలన్న లక్ష్యంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది.

Posted in Uncategorized

Latest Updates