నీరవ్ గురించి.. ప్రధానిని అడగండి: రాహుల్

rahulప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సారి వస్తే.. నీరవ్ గురించి అడగాలని కర్ణాటక ప్రజలకు సూచించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన మోడీ..  వేలకోట్లు దేశం దాటించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీది పేదల ప్రభుత్వమన్నారు రాహుల్. పేదలను, రైతులను బీజేపీ పట్టించుకోలేదన్నారు.

ఆదివారం(మార్చి-25)శ్రీరంగపట్టణలో రాహుల్ రోడ్ షో చేశారు. అబద్దపు హామీలతో మోడీ సర్కారు ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ సర్కారు కార్పొరేట్లకు దోచి పెట్టిందని.. తాము ప్రజలపక్షాన ఉంటామన్నారు. విద్యార్థులందరికి ల్యాప్ టాప్ లు ఇస్తామని చెప్పారు రాహుల్.

సాయంత్రం మైసూరులో సీఎం సిద్ధరామయ్యతో కలిసి.. రోడ్ షో చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేశారు. ప్రజలపై హామీల వర్షం కురిపించారు.

Posted in Uncategorized

Latest Updates