నీరవ్ మోడీతో నరేంద్ర మోడీకున్న సంబంధమేంటీ…?

nirav-modi

–నిలదీసిన శివసేన

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్లకు పైగా ముంచి విదేశాల్లో జల్సాలు చేసుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో స్పందించింది శివసేన. ఆయనతో బీజేపీ ఎందుకు అంటకాగాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీసింది. ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమాల్లో నీరవ్ మోడీ ఎందుకు ఉన్నారని, ప్రధానితో ఆయనకున్న సంబంధమేమిటని ప్రశ్నించింది శివసేన. ఇవాళ పార్టీ సొంత పత్రిక ‘సామ్నా’లో శివసేన స్పందిస్తూ… ‘‘నీరవ్ మోడీ బీజేపీలో భాగమే. ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీకి సహాయం చేశారు.’’అని పేర్కొన్నారు.

రూ.100, రూ.500 మేర రుణాలను సైతం కట్టలేక ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం భారీ మొత్తంలో సొమ్ములు పట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు అని విమర్శించింది శివసేన. ముంబైలో ఛాగన్ భుజ్‌బల్, పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్‌లు జైళ్లలో మగ్గుతుంటే… లిక్కర్ డాన్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్లు మాత్రం కోట్లాది రూపాయలు పట్టుకుని విదేశాలకు పారిపోయారని శివసేన ఆరోపించింది.

Posted in Uncategorized

Latest Updates