నీరవ్ మోడీ కేసు: దర్యాప్తు చేస్తున్నఅధికారి బదిలీ

niravmodiనీరవ్ మోడీ కేసు దర్యాప్తు చేస్తున్న త్రిపుర క్యాడర్ కు చెందిన IPS అధికారి రాజీవ్ సింగ్ తిరిగి ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం కొనసాగుతున్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం ఉండబోదని CBI అధికారులు తెలిపారు. త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ వినతితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. త్రిపుర రాష్ట్రానికి చెందిన ముగ్గురు IPS అధికారులు సీబీఐకు డిప్యూటేషన్ పై వెళ్ళారు. రాజీవ్ సింగ్ తో పాటు డిఐజీ అనీష్ ప్రసాద్. ఎస్పీ గోపాలకృష్ణారావులు సీబీఐలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.

రాజీవ్ సింగ్ ప్రస్తుతం నీరవ్ మోడీ కేసును విచారణ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి  చాలా సార్లు లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమని కోరారు. మరోవైపు నీనా సింగ్ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కు లో పనిచేస్తున్నారు. ఆయనను కూడ ఆయన స్వంత రాష్ట్రమైన రాజస్థాన్ కు పంపనున్నారు. నీనాసింగ్ నేతృత్వంలోని టీమ్ గురుగ్రామ్ లోని స్కూల్ లో విద్యార్ధి హత్యతో పాటు కోటైకాయ్ విద్యార్ధి గ్యాంగ్ రేప్ ఘటన ను చేధించారు.అంతేకాదు షీనాబోర కేసును కూడ ఆయన కొంతకాలం పాటు పర్యవేక్షించారు. ఈ రెండు రాష్ట్రాల నుండి వచ్చిన వినతులతో ఈ అధికారులను సీబీఐ నుండి మే 24 వ తేదిన రిలీవ్ చేసినట్టుగా సీబీఐ వర్గాలు తెలిపాయి. త్రిపుర క్యాడర్ కు చెందిన రాజీవ్ సింగ్ నీరవ్ మోడీ కేసును విచారిస్తున్నారు. అంతేకాదు ICICI, వీడియోకాన్ కేసును కూడ విచారిస్తున్నారు. ఈ నలుగురు ఐపీఎస్ అధికారులను వారి రాష్ట్రాలకు తరలించడంతో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని సీబీఐ అధికారులు చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates