నీరవ్ మోడీ బరితెగింపు : నా బ్రాండ్ నాశనం చేశారు.. డబ్బులు కట్టలేను

neeravప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా బ్యాంక్ దోపిడీకి పాల్పడిన.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎదురుదాడి మొదలుపెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైనే అభాండాలు వేస్తున్నాడు. బ్యాంక్ వైఖరి కారణంగా చెల్లించాల్సిన డబ్బులను కూడా ఇవ్వలేకపోతున్నానంటూ లేఖ విడుదల చేశాడు. నీరవ్ మోడీ అనే బ్రాండ్ ను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేశారు.. ఇక డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చి కట్టాలి అంటూ బరితెగించేశారు. రూ.17వేల 500 కోట్లు అప్పనంగా కొట్టేసిందే కాకుండా.. తనేదో పెద్ద నీతివంతుడిలా బ్యాంక్ పైనే కౌంటర్ ఎటాక్ కు దిగుతున్నాడు.

ఫిబ్రవరి15, 16 న నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు రెండు లేఖలు రాసాడు. అందులో నీరవ్ మోడీ ప్రస్తావించిన వివరాలు ఇలా ఉన్నాయి. మీరు తీసుకున్న చర్యల కారణంగా నా బ్రాండ్ దెబ్బతింది. దీంతో  అప్పులను రికవర్ చేసుకునే సామర్ధ్యాన్ని మీరు కోల్పోయారు. మీ ప్రచారం తో మీడియా రంగంలోకి దిగింది. దీంతో అది కాస్తా.. వెంటనే అధికారులకు చేరి, వెంటనే తనిఖీలు, సీజ్ ఆపరేషన్లు జరిగాయి. దీని వల్ల ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ వ్యాపారాలపై వీటి ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో మేము బ్యాంకులకు కట్టాల్సిన సొమ్మును కూడా మీ చర్యల ద్వారా కట్టలేని విధంగా చేశారు.

అప్పులను రికవర్ చేసుకోవాలన్న అత్యుత్సాహంతో మీరు పనిచేయడం వలనే, ఈ విషయం ప్రజలకు తెలిసే ముందు రోజు ఫిబ్రవరి 13 న నేను ఇచ్చిన ఆఫర్ ను కూడా కాదన్నారు. దీనికి అంతటికి కారణం మీ తప్పిదమే, నా పొరపాటు ఏమీ లేదు. నన్ను దయచేసి తప్పుపట్టవద్దు అంటూ నీరవ్ పంజాబ్ నేషల్ బ్యాంక్ కు రాసిన లేఖల్లో తెలిపాడు.

 

 

Posted in Uncategorized

Latest Updates