నీ చెత్త నువ్వే ఉంచుకో….భలేగా బుద్ది చెప్పిన యువతి

బహిరంగ ప్రదేశాల్లో చెత్త విసిరేయరాదు, ఉమ్మి వేయరాదు, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, వంటివి పడేయవద్దు…స్వచ్చత పాటిద్దాం అంటూ ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మారం…మేము ఇలాగే ఉంటాం అనేలా కొందరు వ్యవహరిస్తుంటారు. ఇలాగే నడ్డి రోడ్డుపై చెత్త వేసిన ఓ మహిళ కు జరిగిన గుణపాఠం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైనా రాజధాని బీజింగ్‌ లోని ఓ జంక్షన్ దగ్గర సిగ్నల్ పడటంతో కారు ఆగింది. కారులో ఉన్న మహిళ కిటికీలోంచి ఓ చెత్త సంచిని రోడ్డుపై విసిరేసింది. అదే సమయంలో వెనుక నుంచి ఓ బైక్ వచ్చి కారు పక్కన ఆగింది యువతి. బైక్ పై నుంచి కిందకు దిగి చెత్త సంచీని తీసి తిరిగి కారులో విసిరేసింది. మళ్లీ కారులోకి చెత్తను విసిరేయడంతో కారులోని మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే డోర్ తీసి ఆ యువతిని ఆపబోయింది. అయితే ఆ యువతి అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో……యువతి చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. రోడ్లపై చెత్త వేసేవాళ్లకి ఈ ఘటన చూసి కనువిప్పు కలగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates