నీ తిక్కేందో చెప్పు : పోలీస్ విచారణకు వర్మ

rgv-policeడైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. ఓ టీవీ ఛానల్ లో జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో.. తనను అవమానకరంగా దూషించటం, మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడటంపై సామాజికవేత్త దేవీ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరుకావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు.. వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు అవుతున్నారు.

వర్మను విచారించేందుకు ప్రత్యేక బృందం కూడా రెడీగా ఉంది. మొత్తం 11 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు తీసుకోనున్నారు. మహిళలతో అనుచితంగా మాట్లాడటం ఒకటి అయితే.. వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలపైనా వివరణ తీసుకోనున్నారు. వర్మ అరెస్ట్ అవుతారు అనే వార్తలు వస్తున్నా.. వాటిలో నిజం లేదంటున్నారు పోలీసులు. విచారణ తర్వాత మాత్రం నిర్ణయం తీసుకుంటామని.. ఇప్పటికిప్పుడు అరెస్ట్ అనేది ఉండకపోవచ్చని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.


Posted in Uncategorized

Latest Updates