నీ పట్టుదలకి సలాం : కాళ్లతో రాస్తూ.. జీవితాన్ని గెలిచిన చిన్నారి

writing-with-legఆ చిన్నారి వయస్సు పదేళ్లు. పేరు కమల్ జీత్ సింగ్. ఐదో తరగతి చదువుతున్నాడు. ఊరు పంజాబ్ రాష్ట్రం లుధియానా. పుట్టుకపోతే చేతుల్లో లోపం గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ చేతులు చచ్చుబడిపోతున్నాయి. ఎంతో మంది డాక్టర్లకు చూపించిన లాభం లేదు. చేతులతో ఏ పనీ చేయలేని పరిస్థితికి వచ్చేశాడు. అయినా గుండె నిబ్బరం కోల్పోలేదు. ఆ తల్లిదండ్రులు అధైర్య పడలేదు. చేతులతో చేసే అన్ని పనులను కాళ్లతో చేయటం అలవాటు చేశారు.

కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటున్నా.. చదువు విషయంలో మాత్రం ఆ పేరంట్స్ కి బెంగ ఉంది. చదవటం అయితే బాగుంది కానీ.. ఎలా రాయాలి అనేది డౌట్. అన్నీ పనులు కాళ్లతో చేసినప్పుడు.. రాయటం కూడా ఎందుకు చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కాళ్లకి పెన్ను పట్టించారు. మూడేళ్లు అదేపనిగా దగ్గుండి సాధన చేయించారు. ఇప్పుడు కమల్ జిగ్ సింగ్.. మామూలు పిల్లలు ఎలా అయితే చేతులతో రాస్తారో.. అదే విధంగా కాళ్లతో చకచకా రాసేస్తున్నారు. దీని వెనక ఉపాధ్యాయుల కృషి కూడా ఉందని చెబుతున్నారు చిన్నారి కమల్ జిత్ సింగ్ పేరంట్స్

మొదట్లో స్కూల్ లో జాయిన్ చేసుకోవటానికి కూడా వెనకాడిన స్కూల్.. ఇప్పుడు కమల్ లోని ఉత్సాహం చూసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. క్లాస్ లో కింద కూర్చోవటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న కమల్.. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కూడా కాళ్లతో రాయటానికి అమనుతి ఇవ్వాలని అధికారులను కోరుతున్నాడు. ఆల్ ద బెస్ట్ కమల్.. నీ సంకల్పం ముందు.. అంగవైకల్యం చిన్నబోయింది..

Posted in Uncategorized

Latest Updates