నీ వెంటే కేరళ : కాలేజీ అయిపోగానే వీధిలో చేపలమ్ముతుంది

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కాలేజీ ముగించుకొని యూనిఫామ్ లోనే బిజీగా ఉండే రోడ్లపై చేపలు అమ్ముతున్న హమీన్ హనన్ హమీద్(21) కు మద్దతు తెలిపారు కేరళ సీఎం పినరయి విజయన్. హనన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. హనన్ కు రక్షణ కల్సించాలని జిల్లా కలెక్టర్ కు కూడా సీఎంవో ఆదేశాలు జారీ చేసింది.

కుటంబంలోని ఆర్ధిక పరిస్ధితుల కారణంగా చదువుకి దూరం కాకూడదని భావించింది కేరళకు చెందిన యువతి  హనన్ హమీద్(21). ఇడుక్కి జిల్లా తోడుపుజాలోని AI అజర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతుంది హనన్ హమీద్. ఉదయాన్నే కాలేజీ వెళ్లడం, కాలేజీ పూర్తయన తర్వాత మార్కెట్‌ కు వెళ్లి చేపలు తెచ్చుకుని వాటిని పలరివట్టమ్-తమ్మనం జంక్షన్ లో అమ్ముతుంటుంది. హనన్ చేస్తున్న పనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో అనేకమంది బ్రతుకు పోరాటంలో హనన్ చేస్తున్న పనికి మద్దతు తెలిపారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న “ఇరుపత్తియోన్నమ్ నోట్టండు” సినిమాలో కూడా హనన్ కు ఓ పాత్ర ఆఫర్ చేశాడు మళయాలం డైరక్టర్ అరుణ్ గోపయ్. అయితే… కొందరు మాత్రం సోసల్ మీడియా వేదికగా హనన్ పై విమర్శలు చేస్తున్నారు. కేరళ ప్రజలను హనన్ ఫూల్స్ చేస్తుందంటూ అభ్యంతరకరమైన పదాలతో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా కేవలం ప్రచారం కోసమే హనన్ చేస్తుందని విమర్శిస్తూ ఆమెకు హాని చేస్తామని బెదిరిస్తున్నారు.

తనపై వస్తున్న నెగిటీవ్ కామెంట్లపై స్పందించిన హనన్……..కేవలం నా గురించి తెలియకపోవడం వలనే కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. నన్ను ఓ లయర్(అబద్దం చెప్పడం) అని పిలుస్తున్నారు. ఏడవ తరగతి నుంచే నేను బ్రతుకుపోరాటం చేస్తున్నాను. నా కుటుంబం కోసం, నా చదువు కొనసాగించడం కోసం అనేకరకాల ఉద్యోగాలు చేశాను. ఆ ఉద్యోగాలలో ఈ చేపలమ్మడం కూడా ఒకటి, ఇప్పటివరకూ ఎవ్వరినీ తాను సాయం చేయమని కోరలేదని, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నానని,MBBS చదవడమే తన లక్ష్యమని హనన్ తెలిపింది.

హనన్ విషయంపై శుక్రవారం కేరళ సీఎం పిన్నరయి విజయన్ ఈ విధంగా స్పందించారు. హసన్‌ గురించి ప్రస్తావిస్తూ ఫేస్‌బుక్‌ లో ఈ విధంగా పోస్ట్ చేశారు. సొంత కాళ్లపై నిలబడుతూ చదువుకోవాలనే నీ తపన చూస్తుంటే గర్వంగా ఉంది. చదువుకునేందుకు కష్టపడి పని చేసుకుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన వాళ్లకి నీ కష్టం అర్థమవుతుంది. హసన్‌.. తన కోసం మాత్రమే పని చేయడం లేదు, తన కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. తన బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే తను చేస్తున్న పని చూసి గర్విస్తున్నాను. హసన్‌ ఇదే ధైర్యంతో ముందుకెళ్లు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. నీ వెంట నేనున్నాను. కేరళ నీకు అండగా నిలుస్తుందని సీఎం పినరయి విజయన్‌ ఆ పోస్ట్ లో తెలిపారు. చేపలు అమ్ముకుంటున్న హసన్‌ ఫొటోను ఆయన షేర్‌ చేశారు. హనన్ పై జరుగుతున్న సైబర్ దాడిని కేరళ రాష్ట్ర ఉమెన్స్ కమీషన్ చైర్ పర్సన్ ఎమ్ సీ జోసెఫైన్ కూడా ఖండించారు.

 

Posted in Uncategorized

Latest Updates