నీ వెనకే ప్రపంచం: అసోం అమ్మాయి.. పరుగు పందెంలో గోల్డ్ మెడల్

మన దేశ అమ్మాయి.. ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఫస్ట్ టైం అమెరికా, రుమేనియా క్రీడాకారిణులను ఓడించి.. అసోం అమ్మాయి.. బంగారు పతకం సాధించింది. క్రికెట్ ఆటలో పడి మర్చిపోయిన ఈ విషయంపై నెటిజన్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిన్లాండ్ లో అండర్ -20 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత యువ స్ప్రింటర్ హిమ దాస్ చరిత్ర సృష్టించింది. అసోం అమ్మాయి అథ్లెటిక్స్ లోని పరుగు పందెం రేసులో బంగారు పతకం సాధించింది. 18 ఏళ్ల హిమ దాస్.. మహిళల 400 మీటర్ల రేసును 51.46 సెకన్లలో పూర్తి చేసి.. ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. హిమకి రుమేనియాకి చెందిన ఆండ్రియా, అమెరికాకి చెందిన టేలర్ గట్టిపోటీ ఇచ్చారు. వీళ్లద్దరినీ సెకండ్, థర్డ్ ప్లేస్ లోకి నెట్టి మరీ హిమ.. బంగారు పతకం సాధించింది.

ప్రపంచ అథ్లెటిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు హిమ దాస్. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారం పతకం కూడా ఇదే కావటం విశేషం. హిమ దాస్ కు ప్రధాని మోడీ అభినందనలు చెప్పారు. నీ స్ఫూర్తి నిరంతరాయం కొనసాగాలని ఆకాంక్షించారు. యువ భారతానికి ఆదర్శం కావాలని కొనియాడు. అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరని.. ప్రోత్సహిస్తే బంగారు పతకాలు సాధించారు అనటానికి హిమ ఓ ఉదాహరణ అన్నారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates