నువ్వా… నేనా : నేడు IPL ఫైనల్ లో తలపడనున్న చెన్నై-హైదరాబాద్

CUPఐపీఎల్ విజేత ఎవరో నేడు తెలిసిపోనుంది.  సీజన్ -11లో ట్రో ఫీ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆదివారం(మే-27)  ఫైట్ జరగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ చెన్నై స్ట్రాంగ్ గా ఉంది. సన్ రైజర్స్ మాత్రం బౌలింగ్ మీదే ఆధారపడి ఉంది. ఎన్నో అనుమానాలు, క్లిష్ట పరిస్థితుల్లో లీగ్ కి ఎంట్రీ ఇచ్చిన రెండు జట్లు… టాప్-2 లో నిలిస్తూ ఫైనల్స్ కి చేరాయి.

మ్యాచుల్లో తక్కువ స్కోర్ చేసినా, బౌలింగ్ లైనప్ తో రాణిస్తూ సన్ రైజర్స్ ఫైనల్ కి చేరితే.. ఎంతటి భారీ లక్ష్యాన్నైనా ఈజీగా చేధిస్తూ వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. స్టార్ ప్లేయర్స్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ లేకున్నా.. బౌలింగ్ తోనే ఫైనల్స్ కి చేరింది సన్ రైజర్స్. లీగ్ లో మిగతా జట్లు ప్లే ఆఫ్ కు చేరేందుకే కష్టాలు పడుతుంటే.. చివరి మూడు లీగ్ మ్యాచ్ ల్లో ఓడినా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది హోమ్ టీమ్. సన్ రైజర్స్ ఫైనల్స్ కి చేర్చడంలో కెప్టెన్ విలియమ్సన్  తోపాటు.. బౌలింగ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్త్ కౌల్, షకీబ్ హసన్ కూడా కీరోల్ ప్లే చేశారు. సన్ రైజర్స్ కి బ్యాటింగ్ కంటే జట్టు బౌలింగ్ పెద్ద బలం. అయితే అన్ని ఫార్మాట్లలో రాణిస్తేనే చెన్నైలాంటి ప్రత్యర్థిని ఓడించొచ్చంటున్నారు క్రికెట్ ఎనలిస్టులు.

ఇక బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ పటిష్టంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఓపెనర్లు వాట్సన్, అంబటి రాయుడు తిరుగులేని ఫామ్ లో ఉండగా.. సురేష్ రైనా రాణిస్తుడం చెన్నైకి ప్లస్ పాయింట్.  బిల్లింగ్స్, ధోని, బ్రేవోలతో మిడిలార్డర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక జడేజా, హర్బజన్ సింగ్ ల స్పిన్, చహర్, శార్దుల్ ఠాకూర్, ఇన్ గిడిల పేస్ ను సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు ఎలా అడ్డుకుంటారన్నది ముఖ్యం.

ఈ సీజన్ లో చెన్నై, హైదరాబాద్ జట్లు.. మూడు సార్లు తలపడ్డాయి. మూడు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్సే విజయం సాధించింది. లీగ్ దశలో రెండు సార్లు గెలిచిన చెన్నై… ఫస్ట్ క్వాలిఫయర్ లో కూడా హైదరాబాద్ మీదనే గెలిచి ఫైనల్ కు చేరింది.

 

Posted in Uncategorized

Latest Updates