నువ్వు గ్రేట్ బావా..

తాము అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని,అభివృద్ధి లో మాత్రమే పోటీ పడుతున్నామని మంత్రులు కేటీఆర్,హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ కలల బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నామని, ఆయన మరికొన్నేళ్లపాటు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని ఆకాంక్షిచారు.

నిన్న(గురువారం) ప్రగతిభవన్ లో సిరిసిల్ల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. మండలాల వారీగా కార్యకర్తలు,నాయకులతో భేటీ అయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ్యాల పై మంత్రులు చర్చించారు. టీఆర్ఎస్ చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలని సూచించారు.

కేటీఆర్ సూపర్..

అభివృద్ధిలో సిరిసిల్ల,సిద్ధిపేట  నియోజకవర్గాలు పోటీపడుతున్నాయని హరీశ్ తెలిపారు. కేసీఆర్ ప్రారంభించిన య‌జ్ఞాన్ని తాను కొనసాగిస్తున్నానన్నారు. సిద్ధిపేటలో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్ సిరిసిల్లలో నాలుగేళ్లలో చేసి చూపించారన్నారు. రాష్ర్టంలో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటిస్తూనే  తన శాఖల బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఒకప్పుడు ఆత్మహత్యలతో ఉరిసిల్లను తలపించిన సిరిసిల్లను.. సిరుల ఖిల్లాగా అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించండం ఖాయమన్నారు.

హరీశ్ బంపర్..

చిన్నప్పటి నుంచి తమకు కేసీఆర్ కేబినెట్లో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని కేటీఆర్ చెప్పారు. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశమేనన్నారు. కార్యకర్తలను ఉత్తేజపరిచిన హరీశ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హరీశ్ కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును పరిగెత్తిస్తున్నారని ప్రశంసించారు. రైతుల బాగుకోసం త్వరితగతిన ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని మెచ్చుకున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates