నువ్వు దేవుడువయ్యా..మానవత్వం చాటుకున్న హైదరాబాద్ పోలీస్

buchamma HELPజగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాదీ అనే జీవిత మాట.. ఈ అవ్వకు కరెక్టుగా సరిపోతుంది. నలుగురు కొడుకులు..ఐదుగురు కూతుర్లు ఉన్నా..ఒక్కరూ ఈ అవ్వను పట్టించుకోలేదు. భర్త చనిపోవడం ఒంటరి అయ్యింది. ఆకలేస్తే అన్నం పెట్టే వాళ్లు లేకుండా పోయారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ కు చెందిన బుచ్చమ్మ(75) ..కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి JNTU దగ్గర బిక్షాటన చేస్తూ కాలం గడుపుతుంది.

ఆదివారం (ఏప్రిల్-1)  ఆకలితో అలమటిస్తూ దీనంగా అందరివైపు చూస్తున్నా ఆ అవ్వను ఎవ్వరూ పట్టించుకోలేదు. తమకేం సంబంధం లేదన్నట్టుగా పక్కనుంచి చూస్తూ వెళ్లి పోయారు. దీంతో ఇది గమనించిన కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డు B. గోపాల్ అవ్వను చేరదీసి అల్పాహారం తినిపించాడు. అటుగా వెళ్తున్న హర్షా భార్గవి అనే మహిళ అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి అని అవ్వకు అల్ఫాహారం తినిపిస్తున్న హోంగార్డు ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషుల్లో మానవత్వం ఇంకా చనిపోలేదని..అతడు రియల్ హీరో..వీళ్లు ఫ్రెండ్లీ పోలీసులు మాత్రమే కాదు..సోషల్ రెస్పాన్సిబులిటీ ఉన్న పోలీసులని ట్విట్టర్ లో అతడికి అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్లు. గుడ్ జాబ్ కీప్ ఇట్ అప్ అంటూ ట్విట్ చేశారు సైబరాబాద్ సీపీ.

Posted in Uncategorized

Latest Updates