నువ్వు మహారాజువయ్యా : భార్యకి గుడి కట్టి.. నిత్యపూజలు

wife1కట్నం కోసం వేధించాడు.. డబ్బుల కోసం ఆలినే అమ్మేశాడు.. రోజూ భార్యను కొడుతున్నాడు.. డబ్బు కోసం భార్య కిడ్నీ అమ్మేశాడు.. ఇలాంటి వార్తలు చదవటమే కాదు.. సోషల్ మీడియాపై భార్యపై వచ్చినన్ని జోక్స్ ఎవరిపైనా ఉండవు. ఇలాంటి టైంలో.. ఓ భర్త తన భార్యకు గుడి కట్టి.. ఆమె విగ్రహానికి నిత్య పూజలు చేయటం విడ్డూరమే కదా. కర్నాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కృష్ణాపుర గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

రాజు అలియాస్ రాజు స్వామి అనే రైతు ఉన్నాడు. ఇతనికి రాజమ్మతో వివాహం అయ్యింది. అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఆదర్శ దంపతులు అంటే వీరే. భార్య రాజమ్మ అంటే రాజుకి విపరీతమైన అభిమానం. అందులోనూ వీరిది ప్రేమ వివాహం. సొంత అక్క కూతురే అయినా.. రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకరించకపోవటం ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరికి ప్రేమ మరింత పెరిగింది.

భార్య రాజమ్మకు ఓ కోరిక ఉంది. కృష్ణాపురం గ్రామంలో ఓ గుడి నిర్మించాలని. అందుకు రాజు కూడా అంగీకరించాడు. గేడి పనులు ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలోనే భార్య రాజమ్మ అనారోగ్యంతో చనిపోయింది. దీంతో భార్య చివరి కోరికగా దేవుళ్లకు కాదు.. భార్యకే గుడి కట్టాలని నిర్ణయించాడు. ప్రేమకు చిహ్నంగా, భార్యపై ప్రేమకు గుర్తుకు గుడి కట్టాడు. గుడిలో భార్య విగ్రహం చుట్టూ.. మిగతా దేవుళ్లను పెట్టాడు. గ్రామస్తులు అందరూ వ్యతిరేకించినా.. డోంట్ కేర్ అన్నాడు. గుడి కట్టి.. భార్య విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నాడు.

షాజహాన్ తాజ్ మహల్ తన ముంతాజ్ కోసం కట్టింది మనం చూడలేదు కానీ.. ఈ రాజు మాత్రం భార్యకి గుడి కట్టి రారాజు అయ్యాడు.

Posted in Uncategorized

Latest Updates