నెక్స్ట్ ప్రధాని ఎవరనేది చెప్పలేం: రాందేవ్ బాబా

2019 సాధారణ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సమయంలో యోగ గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకిస్తున్నాయి. గతంలో పాలక బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా సమర్ధించిన రాందేవ్‌ బాబా మాట మార్చారు. తదుపరి ప్రధాని ఎవరో చెప్పడం కష్టమని.. దేశానికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందన్నారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే ఎదురైంది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికిన రాందేవ్‌… రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ వ్యక్తికీ, పార్టీకి మద్దతు ప్రకటించడం, వ్యతిరేకించడం చేయనని ఇటీవల తెలిపారు. రాజకీయాలపై తాను దృష్టిసారించడం​లేదన్నారు. తమకు ఎలాంటి రాజకీయ, మతపరమైన అజెండా లేదని స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates