నెటిజన్స్ క్వశ్చన్స్ : ఈ బాత్ టబ్ లో పడి.. శ్రీదేవి ఎలా చనిపోతుంది!

Sridevi-Death-Mysteryశ్రీదేవి పడి చనిపోయిన బాత్ టబ్ ఇదే అంటూ గల్ఫ్ పత్రికల్లో కథనాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోటల్ జుమైరా ఎమిరేట్స్ టవర్స్ లో శ్రీదేవి బస చేసిన గదిని సీజ్ చేశారు పోలీసులు. గది మొత్తం తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎమిరేట్స్ టవర్స్ లో శ్రీదేవి పడి చనిపోయిన బాత్ టబ్ ఇదే.. ఇందులో పడి శ్రీదేవి ఎలా చనిపోతుంది.. 54 ఏళ్లుగా ఆరోగ్యంగా.. మొదటి నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించిన శ్రీదేవికి బాత్ టబ్ గురించి ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. మద్యం తాగినా.. ఇంత చిన్న టబ్ లో పడి చనిపోవటం ఎలా సాధ్యం అని ఎవరికి వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బాత్ టబ్ చాలా చిన్నగా ఉంది.. ఎలా పడి చనిపోతుంది అంటూ నెటిజన్స్ డౌట్స్. ఎవరైనా తోసి ఉండొచ్చు కదా అని కూడా అంటున్నారు. శ్రీదేవికి మద్యం అలవాటు లేదని.. అప్పుడప్పుడు వైన్ తీసుకుంటుందని కపూర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు. అలాంటప్పుడు మద్యం ఎక్కువగా తాగి.. ఈ టబ్ లో పడి ఎలా చనిపోతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే ఆత్మహత్య కోణాన్ని చూపిస్తున్నారు. ఏది ఏమైనా గుండెపోటు వల్ల శ్రీదేవి చనిపోలేదు అనే మాత్రం ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ చెబుతున్న సత్యం.. మరి ఎలా చనిపోయింది అనేది చెప్పాల్సింది అక్కడే ఉన్న భర్త బోనీకపూర్. ప్రస్తుతం విచారణ చేస్తున్న పోలీసులు.. ఆ విషయాన్ని నిగ్గుతేలుస్తారని ఆశిద్దాం…


Posted in Uncategorized

Latest Updates