నెట్ బ్యాంకింగ్ యూజర్లకు SBI డెడ్ లైన్

ఢిల్లీ: SBI నెట్ బ్యాంకింగ్ యూజర్లు డిసెంబర్ 1,2018 లోగా తమ మొబైల్ నంబర్ ను నెట్ బ్యాంకింగ్ కు రిజిస్టర్ చేసుకోవాలని సంస్థ తన వెబ్ సైట్ లో తెలిపింది. మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోతాయని చెప్పింది. ఇంటర్నెట్ ద్వారా రిజిస్టర్ చేయడానికి వీలుపడకపోతే కస్టమర్లు తమ హోం బ్రాంచ్‌లో సంప్రదించాలని ఎస్‌బీఐ సూచించింది. మొబైల్ నంబర్‌ రిజిస్టర్  చేయకపోతే  నెట్ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా నిలిచిపోతాయని SBI తెలిపింది.

 

 

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates