నెత్తి మాడుతోంది : భగ్గుమంటున్న ఎండలు

summerరాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో 40 డిగ్రీలు దాటింది. జిల్లాల్లోనూ 41 డిగ్రీలకు పైగానే  టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. వేసవి మొదట్లోనే 40కి పైగా టెంపరేచర్ రికార్డ్ కావటంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ట్రోగ్రత నమోదు అయ్యింది. నిజామాబాద్ లో 41.1, మెదక్ లో 40.6, రామగుండంలో 40.2, హన్మకొండలో 39, ఖమ్మంలో 38 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో 44 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏప్రిల్ 15 నుంచి మే 30వ తేదీ వరకు ఈ 40 రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు. వేడిగాలులతో ఉక్కబోత కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

రెండు రోజులు రికాల్స్ :

మరో రెండు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గి.. వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. విదర్భ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో టెంపరేచర్లు తగ్గుతాయంటున్నారు. ఆకాశంలో మేఘాలు ఏర్పడి వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎండలు ముదిరితే వాతావరణంలో మార్పులు సహజమే అంటున్నారు నిపుణులు. అయితే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates