నెదర్లాండ్స్ తో మరిన్ని సంబంధాలు : మోడీ

MODIభారత  ఆహార శుద్ది  పరిశ్రమల  రంగంలో  నెదర్లాండ్స్  భాగస్వామ్యం  మరింత పెరగబోతుందన్నారు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ. భారత్ వచ్చిన  నెదర్లాండ్స్ ప్రధానమంత్రి  మార్క్  రూట్ తో…. మోడీ  ద్వైపాక్షిక  చర్చలు జరిపారు.  2017లో.. తాను  నెదర్లాండ్స్ వెళ్లినప్పుడు  ఇంటర్నేషనల్  సోలార్ అలయన్స్ లో  భాగస్వామి కావాలని  …రూట్ ను  కోరానన్నారు. ISAలో  నెదర్లాండ్స్  సభ్యదేశంగా మారడం తనకు సంతోషం  కలిగించిందన్నారు.

భారత్- నెదర్లాండ్స్ మధ్య  సంబంధాలు మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించామన్నారు. అంతకుముందు రెండు దేశాల వ్యాపారవేత్తలు, CEOలతో  ఇద్దరు  ప్రధానులు  సమావేశమయ్యారు.


Posted in Uncategorized

Latest Updates