నెరవేరనున్న సింగరేణి కార్మికుల సొంతింటి కల

Singareni -houseసింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని సింగరేణి అమలు చేసింది. రూ. 10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపునకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. ఇది దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలోనూ లేని వినూత్న పథకమన్నారు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్.

దీంతో వెంటనే అమలుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రూ. 10 లక్షల గృహ రుణంపై వడ్డీ మొత్తాన్ని సింగరేణి చెల్లించనుందన్నారు శ్రీధర్. ఇప్పటికే గృహ రుణం తీసుకున్నవారికి కూడా రూ. 10 లక్షల రుణానికి వడ్డీ చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ. 130 కోట్ల వరకు వడ్డీ రూపంలో కార్మికులకు సింగరేణి చెల్లించనుందన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్..ఈ నిర్ణయం తీసుకున్నరని తెలిపారు శ్రీధర్.

Posted in Uncategorized

Latest Updates