నెలకు 10 లక్షలు ఇప్పించండి: షమీపై కోర్టులో హసీన్ మరో కేసు

shamiటీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ మరో కేసు పెట్టింది. ఇప్పటికే షమిపై హత్యాయత్నం, గృహ హింస కేసులు పెట్టిన ఆమె.. కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో గృహహింస చట్టం కింద పిటిషన్ వేస్తూ తనకు, తన కూతురుకు భరణం చెల్లించేలా షమీని ఆదేశించాలని కోర్టును కోరింది. చెక్ ద్వారా ఇటీవల బ్యాంకు నుంచి డబ్బులు తీసుకునేందుకు హసీన్ ప్రయత్నించి విఫలమయ్యారు. షమీ చెక్‌లను బ్లాక్ చేయడంతో బ్యాంకులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో ఆమె భరణం కోసం కోర్టును ఆశ్రయించారు.

కేసు నడుస్తున్న సమయంలో నెలకు రూ.10 లక్షలు ఇప్పించాలని కోర్టును కోరింది హసీన్ జహాన్. అందులో 7 లక్షలు కుటుంబ నిర్వహణకు, మరో 3 లక్షలు తమ కూతురి కోసం అని చెప్పింది. హసీన్ పరిస్థితిని అర్థం చేసుకొని.. కోర్టు కూడా దీనిని అత్యవసర విచారణ కింద స్వీకరించిందని.. ఈ విషయంలో షమీ కూడా తన వాదనను వెంటనే వినిపించాలని ఆదేశించినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. షమీతోపాటు అతని తల్లి, సోదరుడు, సోదరిపై గృహ హింస కేసు పెట్టిందని ఆ న్యాయవాది చెప్పారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో హసీన్.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిసింది.

Posted in Uncategorized

Latest Updates