నేటి తరానికి ఆదర్శం భాగ్యరెడ్డి వర్మ : సీఎం కేసీఆర్

KCR-Pragathi-Bhavanదళిత జనోద్దరణ కోసం ఉద్యమాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన భాగ్యరెడ్డి వర్మ నేటి తరానికి ఆదర్శమన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారులేసిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ 130వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని గుర్తు చేసుకున్నారు సీఎం. ఉద్యమకారుడుగా, హక్కుల కార్యకర్తగా, రచయితగా, పాత్రికేయుడిగా, సంఘసంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞను చాటిన మహోన్నత ఆదర్శమూర్తి భాగ్యరెడ్డి వర్మ అని కొనియాడారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates