నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు


దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే అమ్మవార్ల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్న దసరా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రికి విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. నవరాత్రి వేడుకల్లో తొలిరోజైన ఇవాళ (అక్టోబర్-10) దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. ఈరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 11 గంటల వరకు కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూ లైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే వృద్ధులు, వికలాంగుల కోసం దుర్గఘాట్‌ వద్ద ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కృష్ణవేణి ఘాట్‌ సమీపంలో కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, కృష్ణవేణి ఘాట్ల దగ్గర తాత్కాలిక మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించారు. అలాగే అర్జునవీధి చివరిలో ప్రసాద కేంద్రాలు, అన్నదానం కార్యక్రమం, అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అప్పం పంపిణీ చేయనున్నారు. మల్లికార్జున మహామండపంలో కుంకుమార్చన, యాగశాలలో చండీహోమానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates