నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయాల్సిన చీరలను ఇవాళ్టి(బుధవారం) నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ చీరలను బతుకమ్మ పండగ సందర్భంగానే పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో  బ్రేక్ పడింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో చీరల పంపిణీకి లైన్ క్లియర్ అయ్యింది.

దీంతో లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వయసుల వారీగా రెండురకాల చీరలను సిద్ధం చేశారు అధికారులు. రెండు రకాల బంగారు రంగు అంచులు.. 80 రకాల రంగులతో చీరలు తయారు చేయించారు. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకే ఈ ఆర్డర్ ఇచ్చారు. మొత్తం 96 లక్షల చీరలను.. 25వేల మరమగ్గాలపై నేయించారు. 25 వేల కార్మికులకు ఉపాధి కల్పించారు. మొత్తం రూ.280కోట్ల బడ్జెట్ తో బతుకమ్మ చీరలు తయారు చేయించారు.

Posted in Uncategorized

Latest Updates