నేటి నుంచే యాదాద్రి బ్రహ్మోత్సవాలు

yadadriఈ రోజు(ఫిబ్రవరి17) నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు బాలాలయంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. 24న జరిగే తిరుకల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొననున్నారు.  బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు వినోదం పంచేందుకు ధార్మిక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ నెల 22న జరుగనున్నాయి. ఫిబ్రవరి 27న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

 

Posted in Uncategorized

Latest Updates