నేడు అంబేద్కర్ జయంతి : అంటరానితనంపై అలుపెరుగని పోరాటం

br-ambedkarఅంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం. అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఇవాళ ఆయన 127వ జయంతి. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లోని మోవ్ గ్రామంలో పుట్టారు అంబేద్కర్. పూర్తి పేరు భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్. చదువుకోవాలంటే కులం అడ్డు వచ్చింది. మంచినీళ్ళు తాగాలంటే కులమే అడ్డుగా నిలబడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సమాజంలో వర్ణ, వర్గభేదాలు ఉండొద్దని రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఎందరికో ఆరాధ్యుడయ్యారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆయనకు ఘనంగా నివాళి అర్పించనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారికంగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పా ట్లు చేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌గా ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి వ్యవహరిస్తుండగా, ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ చైర్మన్‌గా బూర్గుల వెంకటేశ్వర్లును ప్రభుత్వం నియమించింది. జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ లబ్ధిదారులకు సంక్షేమ, ఆర్థిక పథకాలను అందజేయనుంది. 400 దళిత కుటుంబాలకు రూ.50 కోట్ల విలువైన వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయనుంది. ఎస్సీ ఆర్థికాభివృద్ధి పథకం కింద 850 మంది లబ్ధిదారులకు రూ.20 కోట్ల సబ్సిడీ రుణాలను అందించనుంది. డ్రైవర్లకు ఉపాధి కల్పనలో భాగంగా ఉబెర్ కంపెనీ ద్వారా 500 టాక్సీ కార్లు, 100 టూవీలర్ వాహనాల పంపిణీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

Posted in Uncategorized

Latest Updates